
జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
అన్నదాన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని షేరెల్లీ వీధి 28వ వార్డ్ చౌలకాయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులను పొందడం జరిగింది
షేరెల్లీవీధి 28వ వార్డ్ నందు ఆంజనేయ స్వామి దేవాలయం నందు గద్వాల ఎమ్మెల్యే దేవాలయం నందు నూతన షెడ్డు ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు చేశారు ఎమ్మెల్యే కి కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం అమావాస్య సందర్భంగా ఆలయంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.అనంతరం 32వ వార్డ్ లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు అమావాస్య సందర్భంగా కౌన్సిలర్ ముత్యాల లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే కి కౌన్సిలర్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా దేవాలయం నందు షెడ్డు నిర్మాణం చేస్తామని చెప్పిన మాట ప్రకారం నిర్మాణం చేసి నేడు అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. నూతన మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికైన సందర్భంగా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటి కార్యక్రమం శ్రీ చౌలకాయ ఆంజనేయస్వామి దేవాలయం షెడ్డు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది అని పేర్కొన్నారు.ఇదేవిధంగా భవిష్యత్తులో గద్వాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి గద్వాల పట్టణాలను ఆదర్శవంతంగా గద్వాల పట్టణంగా తీర్చిదిద్దంగా నా వంతు సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్ , మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్స్ చంద్రశేఖర్, గోవిందు, సత్యం, ముత్యాల లక్ష్మి, మాజీ కౌన్సిలర్ మురళి ,ఇసాక్, నాయకులు సాయి శ్యామ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రిజ్వాన్, మొయినుద్దీన్, వినోద్ లోకేష్, రవి, ప్రవీణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.