
జనం న్యూస్. నందలూరు కడప జిల్లా.
భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ నెంబర్ రాచూరి మురళి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం నందు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ కోట్ల ఉదయ్ ని మరియు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ ని కలిసి నందలూరు లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మరియు ముంబై చెన్నై ఎక్సప్రెస్ ట్రైన్ స్టాపేజి ఇవ్వ వలసినదిగా నందలూరు మండల ప్రజల నుండి కోరడమైనది నందలూరు మండల ప్రజలు నందలూరు రైల్వే స్టేషన్ నుండి హైదరా బాద్ నగరం మరియు చెన్నై నగరాలకు రావాలంటే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వృద్ధులు ,రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ వారు పడే తీవ్రమైనటువంటి ఇబ్బం దులు మరియు ఆర్థిక పరిస్థితులను వివరించడం జరిగినది. నందలూరు నుండి ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలో హైదరాబాద్ మరియు చెన్నై నగరాలకు ప్రజల రాకపోకలు కొనసాగిస్తు న్నారని కనుక వారి యొక్క ప్రయాణాలు తీవ్ర ఇబ్బంది కరమైనటువంటి రీతిలో కొనసాగిస్తున్నారని వివ రించడం జరిగినది దీనికి స్పందించినటువంటి దక్షిణ మధ్య రైల్వే అత్యున్నత అధికారులు రైల్వే బోర్డు మీటింగ్లో ఈ అంశం ప్రతి పాదించామని మరి కొద్ది రోజులలో జరిగేటువంటి దక్షిణ మధ్య రైల్వేఅత్యున్నత అధికారుల మీటింగ్ లో ఈఅంశాన్ని కచ్చితంగా ప్రస్తావించి ఖచ్చితంగా స్టాపింగ్ ఇచ్చేటట్లు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది మరియు రాచూరి మురళి నందలూరు రైల్వే స్టేషన్ మరియు రైల్వే పరిసర ప్రాంతాలు దిగువ స్థాయిలో ఉన్నాయని వాటినిపరిశీలించి రైల్వే పరిసర ప్రాంతాలను రైల్వే ల్యాండ్ లీస్ లకు ఇచ్చి వివిధ రకాల వ్యాపార సముదాయాలు కు ఇవ్వ వలసినదిగా కోరడ మైనది అలాగే రైల్వే పరంగా పలు అభివృద్ధి అంశాల పైన కూడా తెలపడం జరిగినది దీనికి స్పందించినటు వంటి దక్షిణ మధ్య రైల్వే ఉన్నత అధి కారులు పలు అంశాల పైన ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వడం జరిగినది ఇందుకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి కి కృతజ్ఞతలు తెలపడం జరిగినది.
