
జనం న్యూస్- ఫిబ్రవరి 18- నాగార్జునసాగర్ టౌన్-
నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హిల్ కాలనీ మెయిన్ బజార్ మటన్ మార్కెట్ వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఆరెకటిక సంఘం నాయకులు హిరేకర్ రమేష్ జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ ఎనలేని కృషి చేశారని. ధైర్యానికి,ధర్మానికి ప్రతీక అయిన చత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని ఆ మహావీరుని ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాయకులు, బిఆర్ఎస్ నాయకులు సుందర్ రెడ్డి, నర్సింగరావు, ఈశ్వర్ జి, మోహన్‌లాల్, జహంగీర్, అశోక్ జి, శివాజీ, నవీన్, సాయి, రుక్మాజి, మున్నాభాయ్, పమ్మి జనార్దన్ రెడ్డి, విజయ్, చంద్రమౌళి నాయక్, ఆదాసు విక్రమ్, కోట్ల సైదులు, అర్జున్ నాయక్, సురేష్, నరేష్, శివ నాగులు, శివ, శేఖరాచారి, చేపల విజయ్, గణేష్ తంగరాజు, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.