
జనం న్యూస్ 19 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతు భరోసా, రుణమాఫీతో పాటు విత్తనపత్తి రేట్లు పెంపుకై డిమాండ్.జిల్లాలోని రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలి.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న..యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.గద్వాల: జిల్లా కేంద్రంలో ఈనెల 23న సోమవారం రోజు ఉదయం 10 గంటలకు రైతుల సమస్యలపై సమావేశం ఉంటుందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పటివరకు రైతు భరోసా, రైతు రుణమాఫీ తో పాటు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో విత్తనపత్తి రైతులకు సరైన రేట్లు ఇవ్వకుండా రైతులను అన్యాయానికి గురిచేస్తున్నారని, ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా నాయకులు రంగస్వామి, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, మండల నాయకులు ప్రేమ్ రాజ్, మునెప్ప, గోపాల్, గొర్ల తిమ్మప్ప,రోషన్న తదితరులు పాల్గొన్నారు.