
జనం న్యూస్ ఫిబ్రవరి 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
శేర్లింగంపల్లి నియోజకవర్గం అడ్డగుట్ట మెయిన్ రోడ్‌పై నూతనంగా ఏర్పాటైన ‘అన్సరాజ్ గిఫ్ట్ షాప్’ ప్రారంభోత్సవం సోమవారం సాదాసీదాగా కానీ ఉత్సాహభరితంగా జరిగింది. ఇలాంటి చిన్న వ్యాపారాల ప్రారంభోత్సవాలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే సంకేతాలు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. ఆయనతో పాటు పి ఎస్ సి చైర్మన్, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
షాపు యజమానులు రామకృష్ణ యూత్ కార్యదర్శి కిషోర్ మరియు అన్స్ రాజ్ ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, “స్థానిక యువత వ్యాపార రంగంలో ముందుకు రావడం అభినందనీయం. కిషోర్ దినదినాభివృద్ధి సాధించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు. కిషోర్ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ వేడుకలో జనంపల్లి పురేందర్ రెడ్డి, అమర్‌చంద్, సంజీవరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎండి ఇబ్రహీం, కమిటీ సభ్యులు జి. ప్రసాద్, శ్రీధర్ రావు, సూర్యనారాయణ, లక్ష్మీనారాయణ, సి.కె. రెడ్డి, మూర్తి, జి. రవికుమార్, సునీల్ పటేల్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గాంధీ మరియు నాయకులకు జనంపల్లి పురేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కొత్త వ్యాపారానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అడ్డగుట్ట ప్రాంతంలో ఈ గిఫ్ట్ షాప్ ప్రారంభం చిన్న వ్యాపారాలకు కొత్త ప్రోత్సాహం కలిగిస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
