
జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా
చిలిపిచెడ్ మండలం: విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా పాఠాలు బోధించాలని మండల విద్యాధికారి పి. విట్టల్ తెలిపారు. విద్యార్థి కేంద్రిత బోధన విధానాలను అమలు చేస్తే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆయన అన్నారు.స్థానిక సముదాయ సమావేశ సందర్శన సందర్భంగా మాట్లాడిన ఆయన, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని పరిశీలించి తగిన విధంగా బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. బలహీన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎఫ్ ఎల్ ఎన్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేయడం జరిగింది .అదేవిధంగా, తరగతి గదిలో చురుకైన కార్యకలాపాలు, సమూహ చర్చలు, ప్రాజెక్టు పనులను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందుతుందని ఆయన చెప్పారు. పాఠశాలలు శుభ్రత, హాజరు, విద్యా ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమేష్ ,ధన మూర్తి , రిసోర్స్ పర్సన్ లు మహేష్ కుమార్,నవీన్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.