డోంగ్లి ఫిబ్రవరి 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మాధన్ హిప్పర్గా గ్రామంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బూతాలే ప్రకాశ్ కి సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ పట్టువిడవని కృషి మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో రూ. 2.5 లక్షల (Rs.2,50,000/-) ఆర్థిక సహాయంగా ఎల్ ఓ సి( LOC) అందించారు. ఈ సహాయం అందడంతో రోగి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, తనకు పునర్జన్మని ప్రసాదించిన సర్పంచ్ లక్ష్మణ్ పటేల్ కు తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని హర్షం వ్యక్తం చేశారు.


