Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసి యున్న నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశాఖ పట్నం చిన్న వాల్టేర్ వాస్తవ్యులు పల్లా వెంకట చంద్రశేఖర్ అమ్మవారికి రెండు బంగారు మంగళసూత్రాలను 39-961 గ్రాములు దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యళ్ళశ్రీధర్ చేతుల మీదుగా అమ్మవారికి అందజేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో. బిఎస్ఎంకే జోగి నాయుడు ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి, యర్రవరపు సంతోష్ కుమారి, భక్తులు పాల్గొన్నారు.//