Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 20-02-2026:

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు,ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాజంపేట జన సేన పార్టీకేంద్రకార్యాలయంలో నాయకులతో ముఖ్య సమా వేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి క్రిష్ణ మాట్లాడుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలంటే సభ్యత్వ నమోదు కీలకమని పేర్కొన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వాము లయ్యేలా అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిం చారు.ఈ సమా వేశంలో ఒంటిమిట్ట సింగిల్ విండో అధ్యక్షుడుజయక్రిష్ణ,సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త శ్రీకాంత్ ,గీతాం జలి విద్యాసంస్థల అధినేత రమణ, రాజంపేట జనసేన పార్టీ నాయకులు నరసింహ ఊటుకూరు మాజీ సర్పంచ్ నరసయ్య, ఒంటిమిట్ట జనసేన పార్టీ నాయకులు మల్లేశ్వరరెడ్డి,నిత్యానంద రెడ్డి ,కడప జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల విభాగం కార్య దర్శి గురివిగారి వాసు, సిద్ధవటం జనసేన పార్టీ నాయకులు రాజా , యువ నాయకులు కొరముట్ల హరి, అవ్వారురవిశంకర్,గంగయ్య ,షణ్ముఖ ,అబ్బిగారి గోపాల్, బాబీ, తదితర నాయకులు పాల్గొన్నారు.