జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక రంగాలలో విశేష కృషి చేస్తున్న వారికి అందించే టిటిడి వార్షిక సత్కారానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఆగమ పండితులు కాళ్లకూరి సూరిపండును ఆహ్వానించారు. తిరుమలలో జరిగే వేద శాస్త్ర ఆగమన సభలలో భాగంగా మార్చి 10న ఆగమ పండితుడు కాళ్లకూరి సూరి పండుకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఈ మేరకు ఆయనకు టిటిడి నుంచి ఆహ్వానం పంపించారు. టిటిడి ద్వారా ఈ పురస్కారాన్ని కాళ్లకూరి ఆరోసారి అందుకోనున్నారు. ఆలమూరులో దక్షిణ భారతావనిలో ఏకైక ఆలయముగా గుర్తింపు పొందిన పార్వతీ సమేత విక్రమ భట్టిశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా సేవలందించడంతోపాటు వివిధ ప్రాంతాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొని ఆ కార్యక్రమం వివరాలను వివరించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆగమ పండితులు కాళ్ళకూరి సూరి పండుకు టిటిడి పురస్కారం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.


