
మచిలీపట్నం జనంన్యూస్ 20/ఫిబ్రవరి కృష్ణాజిల్లా మచిలీపట్నం: బీసీవై పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్ కోన నాగర్జున మాట్లాడుతూ, భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బీసీ సింహ గర్జన” సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు తగిన కేటాయింపులు, బీసీ కార్పొరేషన్ నిధుల పెంపు, ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా – బీసీల హక్కుల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన కోరారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఐక్యంగా ఈ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సభా ఏర్పాట్లు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ మహాసభ జరగనుంది. విజయవాడ బస్టాండ్ వద్ద నుంచి సభా ప్రాంగణానికి ప్రత్యేక వాహనాల సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కూడా వాహనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.పాల్గొనదలచిన వారు 9770879999నంబర్‌కు సంప్రదించాలని, ఉదయం 6 గంటల నుంచి రాత్రివరకు ఫోన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.మచిలీపట్నం, గుడివాడ, పామరు ,అవనిగడ్డ పెనమలూరు, గన్నవరం తదితర నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలిస్తుంది. కానీ ఈ ఐదేళ్లలో బీసీల కోసం పోరాడే మన నాయకుడు కోసం మన హక్కుల కోసం ఒక రోజు కేటాయించి బీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం” అని కోన నాగర్జున పిలుపునిచ్చారు.