
మానవత్వం చాటుకున్న యువరైతు రవి
● ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉచితంగా ప్రజలకు టమాటాలు పంచిన రైతు రవి
● శుక్రవారం వారాంతపు సంత కావడంతో టమాటాలను భారీగా మార్కెట్ కు తెచ్చిన రైతులు
● కిలో టమాటా ధర రూ. 5 పలకడంతో టమాటాలను తీసుకొచ్చిన వాహనం కిరాయి ఖర్చు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆవేదన
జనం న్యూస్ 21 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు: వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం పరిధిలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన యువరైతు D రవి రెండు ఎకరాల పొలంలో టమాట పంట పండించాడు. టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కిలోకు రూ.5 ఇచ్చేందుకూ వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రవి వాపోతున్నారు. యువరైతు దోమ రవి పెద్ద మనసుతో గ్రామస్తులకు మరియు తనకు తెలిసిన వారందరికీ ఫ్రీగా టమాటలు ప్రతి ఇంటికి 5 కిలోల చొప్పున ఊరందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ రైతు D రవికి ఆదరణ ప్రేమ మనసుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టమాట రైతులను ప్రభుత్వం గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.