
అవసమైతే ఈ. డబ్ల్యు. ఎస్. రిజర్వేషన్ వారిని సమానత్వపు కమిటీలో అవకాశం కలిపిచాలి
జనం న్యూస్ 21 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మంచనపల్లి శ్రీనివాస్,ఉపాద్యాయులు,జాతీయఅంబేద్కర్ అవార్డ్,అంబేద్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి,పి.ఆర్.టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొన్ని వేల సంవత్సరాలుగా భారత దేశంలోని దళిత ,బహుజనులని గుడికి,బడికి మహిళలకు విద్యను దూరం చేసిన మనుధర్మశాస్త్రం.శూద్రులు,అతిశూద్రులు చదివితే ,వింటే సీసం పోసిన, గ్రామాలలోకి వెళ్ళితే ముడ్డికిచీపురు,నోటికి ముంతను కట్టుకొని వెళ్లే సందర్భంలో,ఎంతో మంది మహనీయులు పోరాటలు చేసి మామ్మల్ని కనీసం మనుషులుగా గుర్తిచండి,మా మనోభావాలను కు విలువలు ఇవ్వండి అని హక్కుల కోసం అరటపడిన సందర్భంలో, భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి,షేక్ పాతిమ వంటి వారు విద్యాద్వారానే మనిషికి విలువలు పెరుగుతాయని పోరాటంచేసి,ఈదేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్టి విషయాన్ని రాజ్యాగంలో పోదు పరిచి మనకు విద్యా,ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు (SC,ST,OBC EWS) కలిపిచడం ,విద్యా ద్వారానే సామాజిక,ఆర్ధిక అబిహృది జరుగుతుందని విద్యా,వైద్యని ప్రభుత్వలు ప్రజకు అనిదిచాలని,అంటరాని తనం నిషేధం ఇందు కోసం ఎన్నో చట్టాలు చేసి మనకు ఓటు హక్కును కలిపించిన మహనీయుడు.గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతకు పాకిన కులవివక్షత మనకు స్వాతంత్రం మరియు గణతంత్రం వచ్చి 77 సంవత్సరలు గడిసిన ఈ సందర్భంగా ఎందరో ప్రధాన మంత్రులు ఈ దేశంలో ఉన్న అంటరాని తనం రూపు మపుతామని ప్రజాస్వామ్య,లౌకిక,సార్వభౌ మ్య,గనతంత్ర,రాజ్యాగం ప్రకారం,ప్రజలకోసం ,ప్రజారాజ్యం కోసం పాటు పడతామని,అంటరాని తనాన్ని రూపుమాపుతామని చెబుతున్నారు.దేశభవిష్యత్తు తరగతి నాలుగు గోడల మధ్య నిర్మితం అవుతుందని చెప్పిన భారత దేశంలో కులవ్యవస్థ గ్రామీణ ప్రాంతాలలో నుండి పట్టాన ప్రాంతలలోకి ద్రవస్థితిలో కులం ప్రవేశిస్తుంది, పట్టణలలో ఈ ఇల్లు ఎస్సి లకు ఇవ్వబడదు అని ఎన్నో ఇండ్లకు బోర్డ్ లు మనకు కండ్లముందు కనబడుతున్నవి .మీరు దళితులు మీరు వండిన అన్నాం మేము తినము అని పాఠశాలల్లో మధ్యాహ్నం బోజనం తినని అగ్రవర్ణాల పిల్లలు అని ఎన్నో సంఘటనలు మనము చూస్తున్నాము. కంప్యూటర్,ఏఐ యూగంలో విశ్వవిద్యాలయలో కులవివక్షత భారతదేశంలో మనందరం 77 వ గనతంత్ర దినోత్సవం జరుపుకునే కొన్ని రోజుల ముందు జనవరి 13 ,2026 నాడు విశ్వవిద్యాలయలాల్లో వివక్షత జరిగిందని సుప్రీంకోర్టు కు తెలియజేసిన యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్) కమిటీ.ఇందుకోసం తోటి హిందువులకు ఎస్సి,ఎస్టీ,ఓబీసీ హిందువులకు వ్యతిరేకంగా మరొక్క అగ్రవర్ణాల హిందువుల,నాయకులు పోరాటం చేస్తున్నారు. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంటు కమీషన్) సర్వే ఏమి చెప్పింది తెలంగాణలో 2016 లో హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఒక P.hd స్కాలర్ వేములరోహిత్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు తమకు మెస్సు లో నాణ్యతలేదని,అదేవిధంగా యూనివర్సిటీకి సంబందించిన కొన్ని అంశంపై విద్యార్ధి నాయకులతో కలిసి పోరాటం చేశారు. ఇందుకు గాను ఏడు గురు విద్యార్థులను బ్రాహ్మణ వైస్ ఛాన్స్ లర్ మరియు యూనివర్సిటీ బృదం వారిని రిస్టిఫికేషన్స్ (సస్పెండ్) చేసింది, దీన్ని ఎత్తి వేయాలని సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణంలో టెంట్ వేసుకొని 20 రోజులకు పైన ధర్నాకు దిగినరు, అసమయంలో ఎందరో నాయకులు ఈపోరాటంలో పాలు పంచుకున్నారు. కానీ యూనివర్సిటీ యజమానులు,మానువాద అధ్యాపకులు, సంఘాలు,ఒక్క కేంద్రమంత్రి, వేముల రోహిత్ కోసం ఎవ్వరు మానవతాదృక్పథంతో ఆలోచించలేరు, కేంద్రమంత్రి అండదండలతో అతనిని మానసిక వివక్షతకు గురిచేసి అతడు తన యూనివర్సిటీ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా ఈసభ్యసమాజం తలదించుకునే విధంగా ఒక యూనివర్సిటీ లో ఒక్క p. hd స్కాలర్ చావుకు కారణం ఈ కులవవ్యస్థ. అదేవిధంగా 2019 లో మహారాష్ట్రలో ఒక గిరిజన మహిళ డాక్టర్ తాయేల్ థడ్ వ్వి తోటి డాక్టర్లు నీవు రిజర్వేషన్ వల్ల నీవ్వు డాక్టర్ వి నీకు ప్రతిభ లేదు,నీవ్వు రిజర్వేషన్ వల్లనే నీకు ఉద్యోగం వచ్చింది అని కులం ఆధారంగా వివక్షకు గురిచేసి,అడాక్టర్ ఆత్మహత్య కు కారణం అయిన తోటి డాక్టర్స్. వేములరోహిత్ తల్లి రాధిక 2016లో సుప్రీంకోర్టు కేసు వెయ్యడం జరిగింది,అదేవిధంగా2019 లో డాక్టర్ థడ్ వ్వి తల్లి సుప్రీంకోర్టులో కేసు వెయ్యడం జరిగింది,ఈ దళిత,గిరిజన బిడ్డలు కుల వివక్షత వల్ల మరణించారు అని సుప్రీంకోర్టు లో కేసు వెయ్యడం జరిగింది.ఇందుకు గాను సుప్రింకోర్టు యూజీసీ కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి 2019- 2024 మధ్యకాలాన్ని ప్రామాణికంగా తీసుకొని యూనివర్సిటీ లో సర్వే చేసి ఉన్నత విశ్వవిద్యాలయలలో కులం ఆదరంగా వివక్షతవల్ల ఎఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడ చనిపోవద్దని 2026 యూజీసీ గైడ్ లైన్స్ తయారు చేసి,నివారణచర్యలకు రూల్స్ ఫ్రేమ్ చెయ్యమని చెప్పడం జరిగింది.
ఇందుకు గాను యూజీసీ 704 విశ్వవిద్యాలయలను,1553 ఉన్నతవిద్యావవ్యస్థలో వివక్షత ఉందా అని సర్వే చేయగా విద్య వవ్యస్థలో కులం వల్ల విద్యార్థులు వివక్షతను ఎదుర్కొంటున్నారు, మరి ఈ ప్రామాణిక సంవత్సరంలో 118 శాతం వివక్షత పెరిగిందని యూజీసీ రిపోర్టు 2026 జనవరి 13 నాడు సుప్రీంకోర్టు కు నివేదికను అందించి, నివారణ చర్యలలో భాగంగా కొన్ని గైడ్ లైన్స్ ను ప్రేమ్ చేసింది. మొదటగా సమానత్వపు కమిటీ లు ఏర్పాటు చెయ్యాలని ఇందులో SC,ST,OBC,Phc,మరియు మహిళలను యూనివర్సిటీ నుండి అధ్యాపకులను కలుపుకొని మొత్తం పది మందితో కమిటీని ఏర్పాటు చెయ్యాలి. రెండోది ఎవరికైనా కులం వల్ల వివక్షత జరిగితే వారికి రక్షణగా ఉండాలి.ఏఒక విద్యార్థిని విద్యార్థులు కులం, జెండర్ ఆధారంగా వివక్షకు గురైతే ఏడూ రోజుల్లో వారికి న్యాయం చెయ్యాలని పలు సూచనలు చేసింది యూజీసీ.
ఇందులో ఈ డబ్ల్యు ఎస్ విద్యార్థులను కలిపిన అయిన సరే ఒక వెళ్ల వీరిని ఎవరైనా వివక్షతకు గురి చేస్తే వారికి కూడ శిక్ష ఉండాలని ప్రభుత్వని కోరుతున్నాను. వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అగ్రవర్ణాల నాయకులు,విద్యార్థులు ఈ యూజీసీ బిల్లు వల్ల మాకు అన్యాయం జరుగుతుందని నార్త్ ఇండియాలో బ్రాహ్మనులు పోరాట చేస్తున్నారు,ఇందుకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు బహిరంగంగా తనపదవులకి రాజీనామాలు చేస్తున్నారు,ఇందులో ఓబీసీలను ఎందుకు కాలిపరని,ఓబీసీ లమీద ఏడుస్తున్నారూ కానీ ఇది రిజర్వేషన్ ఉన్న వారికే వివక్షతను ఎదురుకుటూన్నారు అనుకుంటే ఇప్పుడు ఈ డబ్ల్యుఎస్ వారికి ఈ సమానత్వపు కమిటీలో మెంబర్ గా అవకాశం ఇవ్వండి అని ఏ ఒక్క నాయకుడు ప్రభుత్వనికి ఏ ఒక్క నాయకుడు కేంద్ర ప్రభుత్వనికి లేఖ రాస్తాలేరు కానీ విద్యార్థులను వ్యతిరేకంగా పోరాటం చూపిస్తున్నారు, ఒక్కపుడు మేము మండల్ కమీషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశాము ఇప్పుడు యూజీసీ కి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని అగ్రవర్ణాల నాయకులు పోరాటం చేస్తున్న దాంట్లో న్యాయం లేదు ఎందుకంటే అగ్రవర్ణాల ప్రజలు,విద్యార్థులు కులం ఆధారంగా వివక్షత ఎదురుకోవడానికి అవకాశాలు లేవు కేవలం రిజర్వేషన్ ద్వారా వచ్చిన విద్యార్థులు ,అధ్యాపకులు,మహిళలు డిస్ క్రిమినషన్స్ ఎదురుకొంటున్నారు. కావున నేను ఈసమానత్వపు కమిటిలోకి ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ విద్యార్థులను తీసుకోవాలని కోరుతున్నాను. విధ్యవవస్థలొనే ఇంత వివక్షత ఎదురుకొన్న సందర్భంలో ,చదువుకొని గ్రామాలలో పూర్యం ఇంకా ఎంత వివక్షత ఎదుర్కొన్నారో.అందుకే ప్రాథమిక,ఉన్నత పాఠశాలల్లోనే విద్యార్థులకు మనవావిలువలని పెంపొందించి విధంగా విద్యార్థులకు సర్వతోముఖాభిహృది చెందే విధంగా విద్యార్థుల కారికులం ఏర్పాటు చెయ్యాలి,కులం,మతం,లింగం ఆధారంగా వివక్షతకు అవకాశం లేకుండా దేశంలో అందరం సమానమనే భావజాలాన్ని పెంపొందించే విధంగా ఉండాలని,యూజీసీ ఫ్రేమ్ చేసిన 2026 బిల్లు ను అన్ని వర్గాల మేధావులు కలసి చర్చ చేసి ఇందులో అన్ని రిజర్వేషన్ విద్యార్థులను కలపాలి ఎవ్వరూ వివక్షతకు గురైన వారికి యూజిసి రక్షణగా ఉండాలి ,అసలు వివక్షకు గురికాకుండా ఉండే విధంగా రూల్స్ ఫ్రేమ్ చెయ్యాలని కోరుతూ. వ్యాసకర్త మంచనపల్లి శ్రీనివాస్,ఉపాధ్యాయులు,జాతీయ అంబేద్కర్ అవార్డ్,అంబేడ్కర్ విజ్ఞాన వేదిక ప్రధానకార్యదర్శి,PRTUరాష్ట్రఉపాధ్యక్షులు