
జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాకలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టోన్ క్రషర్ కి అనుమతులు ఇవ్వకూడదని గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్యకి వినతి పత్రం ద్వారా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. గ్రామంలో గతంలో స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసి వాటి బ్లాస్టింగ్ మూలంగా దుమ్ము ధూళి లతో పంట పొలాలు నాశనం అయ్యాయని, ఇల్లు పగుళ్లు పారాయని,అంతేకాకుండా భూగర్భ జలాలు అడుగంటి పోయి ప్రకృతి మొత్తం ధ్వంసం అయి గ్రామం కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుందని తెలిపారు. ఇప్పటికే గ్రామ మొత్తం ప్రమాదం అంచులో ఉందని అన్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు మరొక కొత్త స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసే కుట్ర జరుగుతుందని దీని ఏర్పాటు కు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు సర్పంచ్ కు తెలియజేశారు. పచ్చని ప్రకృతి వనరులు గుట్టలు విధ్వంసం కాకుండా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకొని గ్రామాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా చొరవ తీసుకోవాలని సర్పంచ్ కి వివరించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గ్రామంలో స్టోన్ క్రషర్ ఏర్పాటు చేయాలని చూస్తే ఊరుకోమని గ్రామ వనరుల సంక్షేమం కోసం పోరాడుతామని గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గజ్జి ఐలయ్య ఉప సర్పంచ్ తుడుం రాజు ఇతర వార్డు సభ్యులు నూతన క్రషర్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వమని ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాక గ్రామస్తులు బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, పరుమాండ్ల సురేష్ తిరుపతిరెడ్డి, సాంబ రెడ్డి, రాజేంద్రప్రసాద్, తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు…..