
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హర్షం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు ఊట్కూరీ రాములు శనిగరం రాజ్ కుమార్…నిజమాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు విద్యార్థి వీ భాగమునుండి నిజాంబాద్ లో జరిగే మహాసభలకు ఊట్కూరీ ప్రణీత్ గౌడ్ భాషాబోయిన సంతోష్. అవకాశాలు కల్పించాడము ఆనందదాయకమని సిపిఐ నాయకులు తదితర నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఉద్యమ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల కోసం ముందుంటుందని హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర స్థాయిలో రెండోసారి ఎన్నిక కావడం విశేషం.అలాగే తండ్రి భాష బోయిన వీరప్ప పీడిత వర్గాల కోసం సమాజ సమాజ స్థాపన కోసం పోరాడుతూ అమరుడైన ఉద్యమకారుడు. ఆ ఉద్యమ వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని సంతోష్.ప్రణీత్ లు విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన వుట్కూరి ప్రణీత్ గౌడ్ గత 12 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. విద్యార్థి హక్కులు, సమాన విద్యావకాశాలు, సామాజిక న్యాయం కోసం ఆయన నిర్వహించిన పోరాటాలు విశేష గుర్తింపు పొందాయి ఉద్యమంలోనే జీవిత భాగస్వామని ప్రస్తుతం ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనీ అన్నారు తండ్రి వుట్కూరి రాములు ఉద్యమకారుడిగా ఉంటూ తండ్రి అడుగు జాడల్లో నడుసుకుంటూ విద్యను పెంపొందించే విధానాలపై మరింత దృఢంగా పోరాడుతూ, విద్యార్థి-యువజన శక్తిని సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభావవంతమైన ఉద్యమాలు చేపట్టాలని ఇలాంటి మహాసభలను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ప్రణీత్ గౌడ్ ఈ సందర్భంగా మీడియాతో అన్నారు.