

జనం న్యూస్ ఫిబ్రవరి 21, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నూతన పాలకవర్గం బాధ్యతల కార్యక్రమం ఈ రోజు పరిగి మున్సిపల్ యందు ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ ఛైర్పర్సన్ కుడుముల రజిత మరియు వైస్ ఛైర్మన్ కే హనుమంతు మరియు కౌన్సిలర్ సభ్యులు బాధ్యతల స్వీకరణ చేశారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిగి మున్సిపల్ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తామణి ..ప్రజలకు ఏ సమస్య ఉన్న దగ్గరుండి తీర్చే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో మున్సిపల్ అభివృధి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నిక కాబడిన కౌన్సిలర్ల ప్రజల అభీష్టం మేరకే పని చేయాలని ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అదేవిధంగా పరిగి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృదే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని విధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నూతన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు.