
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్, ఫిబ్రవరి 22 జహీరాబాద్
మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్‌లో పలువురు రాష్ట్ర స్థాయి నేతలను, ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ను వారి నివాసంలో కలిసిన చైర్మన్, అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సు రేష్కుమార్ శెట్కార్, టీమ్రీస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్ధం ఉజ్వల్‌రెడ్డి లను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల జహీరాబాద్ మున్సిపల్ చైర్మ నా బాధ్యతలు చేపట్టిన యునూస్ ను నాయకులు అభినందిస్తూ, పట్టణ అభి వృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రంగా అరు ణ్ కుమార్, సీనియర్ నాయకులు పట్లో ళ్ళ శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.