
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన సమర శంఖం పోస్టర్ ఆవిష్కరణ చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టీ ప్రాంతీయ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఎస్ టి యు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సమస్త సమస్యలపై స్పందించి సమస్యలపై పరిష్కారం చూపాలని ఎస్టియు డిమాండ్ చేస్తుందని తెలిపారు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.ఇది హక్కుల కోసం పోరాటం ప్రభుత్వ మౌనం ఇక సహించేది లేదని అన్నారు హామీలు నెరవేర్చేవరకు పోరాటం ఆగదని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో లోని హామీలైన 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి కల్పించాలని, ఉద్యోగులు ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఆర్థిక బకాయిలకు పేస్లిప్ ఇచ్చి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మెమో నెంబర్ 57 ద్వారా 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ లోపు నియామకమైన డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పోలీసులు ఇతర ఉద్యోగులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డి ఏ లను వెంటనే విడుదల చేయాలని. ఉపాధ్యాయులపై బోధనేతర విధులు తప్పించాలనిఎస్టియు డిమాండ్ చేస్తుందని తెలిపారు ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం తర్వాత కూడా స్పందించనిచో ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ద్వారా ప్రభుత్వానికి ఉద్యమ కార్యచరణ ప్రకటించి నిరసన తెలియజేయడం జరుగుతుందని తెలిపారు తెలిపారు. ఎస్ టి యు పల్నాడు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు బొంత రవి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వినుకొండ అక్కయ్య రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ విజయకుమార చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్, చిలకలూరిపేట మండల అధ్యక్షులు షేక్ మస్తాన్వలి ప్రధాన కార్యదర్శి, వడితే రమణ నాయక్. షేక్,అట్లూరి శ్రీనివాసరావు సోమలా నాయక్ ఎస్టి సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు