
జనం న్యూస్ ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు ₹20,49,500 విలువైన 141.350 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.కేసు వివరాలు:గత నెల (జనవరి 24, 2026)న అమలాపురం హైస్కూల్ సెంటర్ నుండి గోఖలే సెంటర్ వరకు ఆటోలో ప్రయాణిస్తున్న తాటికొండ సత్యదేవి అనే మహిళ హ్యాండ్ బ్యాగ్ నుండి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నగలను దొంగిలించారు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమలాపురం టౌన్ పోలీసులు కేసు (Cr.No.29/2026) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితురాలి వివరాలు:అరెస్టయిన ముద్దాయిని తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, డ్రైవర్స్ కాలనీకి చెందిన బండి శివ పార్వతి (33) గా గుర్తించారు. ఈమె గతంలో కూడా గోపాలపురం, గోకవరం, కర్నూల్, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
నేర విధానం:నిందితురాలు ప్రధానంగా ఆటోలు లేదా బస్సుల్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. ప్రయాణికుల వద్ద ఉన్న లగేజీ, హ్యాండ్ బ్యాగ్‌ల నుండి విలువైన వస్తువులను అత్యంత చాకచక్యంగా దొంగిలించడంలో ఈమె ఆరితేరినట్లు పోలీసులు తెలిపారు.పోలీసు బృందానికి అభినందనలు:
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన అమలాపురం డి.ఎస్.పి టి.యస్.ఆర్. కె ప్రసాద్, టౌన్ ఇన్ స్పెక్టర్ పి. వీరబాబు, క్రైమ్ సి.ఐ ఎం. గజేంద్ర కుమార్, ఎస్.ఐ పరదేశి క్రైమ్ సిబ్బందిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.పి రాహుల్ మీనా అభినందించారు