
జనం న్యూస్ ఫిబ్రవరి 24: నిజామాబాద్ జిల్లా
మెండోర మండలంలోని పోచంపాడ్ ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రొద్దుటూరు మమత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మెండోర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.ఎస్సై సుహాసిని మాట్లాడుతూ, టూ వీలర్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు మత్తు పదార్థాలు, మద్యం సేవించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయనిహెచ్చరించారు. మైనారిటీ తీరని వారు వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని హితవు పలికారు.యువత గంజాయి, మద్యం మత్తులోకి వెళ్లి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని,తల్లిదండ్రులు, గురువులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని సూచించారు.
చివరగా విద్యార్థినీ విద్యార్థులచే మత్తు పదార్థాలు సేవించమని, మైనారిటీ తీరే వరకు వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నజీమొద్దీన్, కవిత, సురేందర్, ధర్మపురి, చౌటి భూపతి, గోపి తదితరులు పాల్గొన్నారు.
