
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 24-02-26
రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి గుంటకల్ రైల్వే డివిజనల్ ఆఫీసు నందు సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ జి బి ఎస్ శ్రీనివాస్ ని కలిసి రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో నూతనంగా నిర్మించినటు వంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నందు ప్రతిరోజు అనునిత్యం వాటర్ లీకేజీ అవుతున్నది అందువలన రైల్వే అండర్ బ్రిడ్జి నందు ప్రయాణికులు ప్రయాణం చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళనకు గురవుతు న్నారని తెలపడం జరిగినది అలాగే ఆర్ యు బి పైన షెల్టర్ నిర్మించాలని అలాగే సీసీ కెమెరాలు నిర్మించి ప్రయాణికులు భద్రతలు కాపాడాలని విన్నపించడం జరిగినది అలాగే పాదాచా రులకు ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది మరియు ప్లాట్ ఫామ్ ని పొడిగించవల సినదిగా కోరడమైనది కొన్ని ట్రైన్లలో లేడీస్ కోచ్ ప్లాట్ఫారం కింద వైపున వస్తున్నది కనుక స్త్రీలు లేడీస్ కోచ్ ఎక్కాలంటే తీవ్రమైనటు వంటిఇబ్బందులుఎదుర్కొంటు న్నారని కూడా తెలపడం జరిగినది ఇందుకుగాను సీనియర్ డిఈఎన్ కో- ఆర్డినేషన్ సెక్షన్ రైల్వే ఇంజనీర్లతో ఫోన్లో మాట్లాడి ఆర్ యు బి యొక్క ప్రస్తుత పరిస్థితులను తెలుసు కోవడం జరిగినది. ఆర్ యు బి యొక్క సమస్య ని రెండు వారాల లోపల పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టి నీరు లీకేజీ కాకుండా పటిష్టమైన చర్యలు తీసు కుంటామని హామీ ఇవ్వడం జరిగినది ప్రజల భద్రత రిత్యా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపి ఖచ్చిత మైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది మరియు ప్లాట్ఫామ్ పొడిగింపు చర్య కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఇందుకు గాను రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి రైల్వే డివిజనల్ సీనియర్ డిఈఎన్ కో- ఆర్డినేషన్ జి బిఎస్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగినది.