
ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు లోక్
బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్
జహీరాబాద్, ఫిబ్రవరి 24( జనం న్యూస్ )
రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు బిజెపి నాయకుడు పాలెంకార్ సంతోష్ "ఆల్ ది బెస్ట్ చెప్పారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరు కుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తుకి ఇది పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చివారి యొక్క కలలను నిజం చేయాలని వారు ఆకాంక్షించారు. అదే విధంగా మంచి ఉత్తీర్ణత సాధించి తల్లి తండ్రులకు, మీ అధ్యాపకులకు మంచి పేరు తీసుకరావాలన్నారు.