
.జనం న్యూస్ ఫిబ్రవరి 25 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో, నేషనల్ డైరెక్టర్, ఎం.ఏ. సలీం, ఆదేశాల మేరకు, బీబీపేట ఆ ర్టి ఐ కమిటీ ఆధ్వర్యంలో, మండల తాసిల్దార్ గంగాసాగర్, డిప్యూటీ తాసిల్దార్, రోజా, చేతుల మీదుగా, 2026. నూతన సంవత్సర, సమాచార హక్కు పరిరక్షణ కమిటీ. (ఆర్.టి.ఐ ) క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్, మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్య పౌరులకు ఒక వరం లాంటిదని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క చట్టాన్ని వినియోగించుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం,(ఆర్టిఐ) బీబీపేట మండల కమిటీ అధ్యక్షులు. ఏం.నాంపల్లి, కార్యదర్శి పండ్ల హనుమంతు, మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజలకు ఒక పాశుపదార్థం లాంటిదని, ముఖ్యంగా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని, గ్రామపంచాయతీ నుండి మొదలుకొని, అన్ని డిపార్ట్మెంట్ల, సమాచారాన్ని, తెలుసుకునే హక్కు ఈ చట్టం ద్వారా సామాన్య ప్రజలకు ఉంటుందని, ప్రజలకు మరొక్కసారి గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో, తహసిల్దార్,డిప్యూటీ తాసిల్దారుల,తోపాటు, మండల గిర్దావర్ రామ్ రెడ్డి. సీనియర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి. జూనియర్ అసిస్టెంట్ రాణి. సిబ్బంది, అంద రాజయ్య.జాంగిటి రాజు. రామచంద్రం..లింగం. లతోపాటు, ఆర్టిఐ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.