
జనం న్యూస్ ఫిబ్రవరి 25, వికారాబాద్ జిల్లా
లోని పూడూరు మండలంలో మరియాపూర్ గ్రామం నందు ఈరోజు ఉదయం 10:30 గంటలకు కుసుమ పంట క్షేత్ర స్థాయి దినోత్సవం పునస్కరించుకొని మండలంలోని రైతులు అందరికీ ఆహ్వానం. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు హాజరు అవుతున్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్త రకాల కుసుమ విత్తనాల ప్రదర్శన, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులకు రైతులతో ముఖాముఖి చర్చ కావున మండలంలోని రైతు సోదరులు, ప్రజా ప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి. వ్యవసాయ శాఖ, వికారాబాద్ జిల్లా