
జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్. సిరికొండ మండలంలోని న్యావనంది ఉన్నత పాఠశాలలోని సాంఘిక శాస్త్ర సముదాయ సమావేశం జరిగినది ఈ సమావేశంలో ధర్పల్లి సిరికొండ మండల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ చేయబోతున్న గడుకోల్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దువ్వూరి లక్ష్మారెడ్డి ని సన్మానించడం జరిగినది ఈ సందర్భంగా సముదాయ ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి మాట్లాడుతూ లక్ష్మారెడ్డి సేవలను కొనియాడడం జరిగినది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా ఆయా పాఠశాలల్లో సేవలను అలాగే విరమణ తర్వాత సామాజిక కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. డి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య మాట్లాడుతూ లక్ష్మారెడ్డి సిరికొండ మండలంలోని 33 సంవత్సరాలు సేవలందించారని అలాగే అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు వృత్తిపట్ల అంకితభావంతో పనిచేశారని అలాగే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు యువతకు చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు చేయాలని కోరడం జరిగింది అలాగే సీనియర్ ఉపాధ్యాయులు రాజేశ్వర్ దయల్ సింగ్, మధుసూదన్ , కపిల్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాలకొండ రెడ్డి రెండు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.లక్ష్మారెడ్డి ని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సన్మానించారు.
