
జహీరాబాద్, జనం న్యూస్ 25 ఫిబ్రవరి రూ11.
కోట్లు నిర్మాణం ..
బిల్లులివ్వక తాళం
జహీరాబాద్ సమీకృత మార్కెట్
భవనాన్ని ప్రారంభించి మూడేళ్లు
నేటికీ కాంట్రాక్టరు చేతిలోనే తాళాలు
బిల్లుల కోసం ఎదురుచూపులు
వేలంలో షాపుల కేటాయింపు
డబ్బులు చెల్లించిన వ్యాపారులు
షాపులు స్వాధీనం చేయాలని
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
నెరవేరని మంత్రి హామీ
అట్టహాసంగా ప్రారంబోత్సవాలు జరుపుకున్నా, కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించినా, జహీరాబాద్ లోని సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ మాత్రం సామాన్యుడికి అందుబాటు. లోకి రావడం లేదు. ఆరు సంవత్సరాల క్రితం అడుగులు వేసిన ఈ ప్రాజెక్టు, అధికారుల నిర్ల క్ష్యానికి, పాలకుల ఉదాసీనతకు నిలువుటద్దంగా మారింది. 2020లో రూ.5.50 కోట్ల అంచనా వ్యయంతో, 3వేల గజాల స్థలంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్థల వివాదాలు, నిధుల కొర తను దాటుకుని 2022 నాటికి నిర్మాణం పూర్త యింది. కానీ, కాంట్రాక్టరుకు రావాల్సిన సుమారు రూ.5.5 కోట్ల బకాయిలు చెల్లించక పోవడంతో కథ మొదటికొచ్చింది. బిల్లులు ఇస్తేనే భవనాన్ని అప్పగిస్తానంటూ కాంట్రాక్టర్ బీష్మించడంతో అంగడిలో ఉండాల్సిన దుకా ణాలు రోడ్డుపైకి చేరగా.. షాపుల తాళాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాయి.
వేలం పూర్తయినా దక్కని తాళాలు
ఈ భవనంలో మొత్తం 67 షట్టర్లు, 84 గ్రౌండ్ లెవల్ దుకాణాలు ఉండగా, వీటి కోసం నిర్వహించిన వేలం పాటతో మున్సిపాలిటీకి రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఒక్కో షాపునకు నెలకు రూ.66వేల వరకు వేలం పాడి, ఆరు నెలల అడ్వాన్స్ చెల్లించిన వ్యాపారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. డబ్బులు కట్టి ఏళ్లు గడుస్తున్నా షట్టర్లు అప్పగిం చకపోవడంతో మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆటు కాంట్రాక్టర్ తన బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతు న్నారు. మర్కెట్ కాంప్లెక్సు తెరిపించడంపై గతంలో జిల్లా మంత్రి హామీ ఇచ్చినా అడుగు ముందుకు పడకపోవడంతో వ్యాపారులకు నమ్మకం సన్నగిల్లుతోంది.
రోడ్లపైనే వ్యాపారం.. ట్రాఫిక్ నరకం
మరోవైపు, మార్కెట్ వినియోగంలోకి రాకపో వడంతో వ్యాపారులంతా రోడ్లపైనే తోపుడు బండ్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య జటిలమై నిత్యం వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్లపై అక్రమ వ్యాపారా లను తొలగిస్తేనే తాము లోపలికి వస్తామని వ్యాపారులు తెగేసి చెబుతుంటే, మార్కెట్ తాళాలు తీస్తేనే బయట రద్దీ తగ్గుతుందని ప్రజలు వాపోతున్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ నూతన చైర్మన్ హామీ ఇస్తున్నప్పటికీ అది ఎప్పుడో తెలియక పట్టణవాసులు ఎదురుచూస్తున్నారు. బకాయిల చిక్కుముడి వీడి తాళాలు తెరుచుకుంటేనే సమీ కృత మార్కెట్ భవనానికి మోక్షం లభిస్తుంది.