
భూ సమస్యలకు చెక్..
సర్వే నంబర్ల వారీగా కొత్త మ్యాపులు..
ఆన్లైన్లో పక్కా రికార్డులు..!
నారాయణఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,
జనం న్యూస్,ఫిబ్రవరి 26,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రాసోల్ గ్రామంలో భూ రీ సర్వే అవగాహన సదస్సును గురువారం గ్రామ సచివాలయ ఆవరణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఖేడ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఉమా హారతి హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలకు చెక్,సర్వే నంబర్ల వారీగా కొత్త మ్యాపులు,ఆన్లైన్లో పక్కా రికార్డులు, నమోదు పరచడమే భూ రి సర్వే ముఖ్య ఉద్దేశమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్దాల నాటి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు'భూభారతి' చట్టం ద్వారా విప్లవాత్మక అడుగు వేస్తోంది.2026లో అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్త భూసర్వేను ప్రారంభించి,ప్రతి భూకమతానికి ప్రత్యేక 'భూధార్' నంబర్‌ను కేటాయించనుంది.ఈ సర్వేతో రైతులకు భూమిపై పూర్తి భద్రత, స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా 'భూభారతి' చట్టం ద్వారా ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేస్తోంది అని అన్నారు. నిజాం కాలం నాటి రికార్డులకు స్వస్తి పలికి, 2026లో అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్త భూసర్వే ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న భూ రికార్డులు,మ్యాప్‌లు (నక్షా) దాదాపు వందేళ్ల క్రితం నిజాం పాలనలో రూపొందించినవి. కాలక్రమేణా భూ కమతాలు విడిపోవడం, విస్తీర్ణాలు మారడం వల్ల క్షేత్రస్థాయిలో హద్దుల వివాదాలు పెరిగిపోయాయి అని అన్నారు.ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి ఇంచు భూమిని డిజిటల్ పద్ధతిలో కొలవాలని నిర్ణయించిందని అన్నారు.ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి ప్రత్యేకమైన 'భూధార్' నంబర్‌ను కేటాయించనున్నారు. ఇది రైతులకు తమ భూమిపై పూర్తి భద్రతను,స్పష్టమైన యాజమాన్య హక్కులను కల్పిస్తుంది అని అన్నారు.మొదటి దశలో రెవెన్యూ రికార్డులు అందుబాటులో లేని లేదా తీవ్రమైన వివాదాలు ఉన్న గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు.సర్వే పూర్తయిన వెంటనే కొత్త నక్షా (పటం) రూపొందించి,ఆ వివరాలన్నింటినీ ఆన్లైన్లో భద్రపరుస్తారు.దీనివల్ల భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత పెరుగుతుంది అని అన్నారు.తెలంగాణ రైతులకు భూ సమస్యల నుంచి విముక్తి కలిగించనుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ బిక్షపతి, తహసిల్దార్ షేక్ అహ్మద్ అబ్దుల్ ముఘ్ని,సర్వే టీం, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.