
బిచ్కుంద ఫిబ్రవరి 26 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో నేడు కేంద్ర యువజన వ్యవహారాల శాఖ నిజామాబాద్ జిల్లా యువజన కార్యాలయం ఆధ్వర్యంలో "మేరా యువభారత్"( బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ) మండల స్థాయి క్రీడా పోటీలు జిల్లా యువజన సమన్వయకర్త బి .శైలి గారి ఆదేశాల మేరకు మేరా యువజన భారత్ వాలంటర్ సునీల్ రాథోడ్ నిర్వహించి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె .అశోక్ గారి చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరం ఎంతో ఉందని క్రీడలు విద్యార్థులకు మానసికఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. వెంకటేశం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. హన్మండ్లు. క్రీడల విభాగం సమన్వయకర్త డాక్టర్ వై .సంజీవరెడ్డి అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
