
మద్నూర్ ఫిబ్రవరి 27 జనం న్యూస్
అప్పుల బాధ తాళలేక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి ప్రకారం.. బిచ్కుందకు చెందిన గోనె పీరయ్య (41) సంగారెడ్డి జిల్లాలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతకాలంగా మద్నూర్ మండలం చిన్న శక్కరలో ఉంటున్నారు. ఈనెల 25న అదృశ్యమైన ఆయన చెరువులో శవమై కనిపించారు. మృతుని భార్య సుప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.