
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఫిబ్రవరి27.
ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒంగోలు సమీపంలోని భగీరథ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించారు. భారత ప్రభుత్వ సంస్థ అయిన BIS (Bureau of Indian Standards) ఆధ్వర్యంలో ఈ 'ఎక్స్పోజర్ విజిట్' నిర్వహించారు.నాణ్యతా ప్రమాణాల పరిశీలన: 9వ తరగతి విద్యార్థులు పరిశ్రమను సందర్శించి, నీటి సరఫరాకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపుల తయారీ విధానాన్ని మొదటి నుండి చివరి వరకు ఆసక్తిగా గమనించారు.ఈ పైపుల తయారీలో HDPE (High Density Polyethylene) అనేపదార్థాన్నిఉపయోగిస్తారని, ఇవి చాలా దృఢంగా ఉండి త్వరగా పగలవని అక్కడి నిపుణులు విద్యార్థులకు వివరించారు.తయారు చేయబడిన పైపులు బి ఐ ఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి, నాణ్యతకు చిహ్నమైన ఐ ఎస్ ఐ గుర్తును కలిగి ఉండటాన్ని విద్యార్థులు గమనించి తమ నోట్స్ లో రాసుకున్నారు.ఈ కార్యక్రమం పాఠశాలలోని స్టాండర్డ్ క్లబ్ ( ఎస్సీ ఐడి 61) ఆధ్వర్యంలో జరిగింది. ఈ క్లబ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఫిజిక్స్ ఉపాధ్యాయులు ఒ.వి. రవిశేఖర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. బాలరాజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.పరిశ్రమలోని నిపుణులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ తయారీ ప్రక్రియను చక్కగా వివరించారు. ఈ పారిశ్రామిక సందర్శనలో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు ఒ. నరసింహా రావు, పి. కోటిమోహన్, వి. చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.వి. రమేష్ బాబు, ఎస్. కిషోర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక అవగాహన కలుగుతుందని ఉపాధ్యాయ బృందం పేర్కొంది.