
జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా
భీంగల్ మండలం రహత్నగర్ గ్రామంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా నిర్వహించిన భోగ్ బండారా కార్యక్రమంలోశుక్రవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన జయంతిని వారం రోజులపాటు పార్టీలకు అతీతంగా నిర్వహించాలని, ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసి తనవంతుగా రూ.50 వేల సహాయం అందిస్తానని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో కొత్త పింఛన్లు ప్రారంభించి రూ.4,000 అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బంజారా నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.