
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 27
తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో ఇండిగ్యాప్ పొలంబడి కార్యక్రమం రబీ సీజన్ 2025 -26 సంవత్సరం పప్పుశనగ పంటను ఎంపిక చేసినారు. ఈ కార్యక్రమంలో భాగముగా రైతులు సాగుచేసిన పప్పుశెనగ పంటను ఎక్స్టర్నల్ ఇవాల్యుయేటర్ K.శ్రీహరి ప్రసాద్ పరిశీలించారు.పొలంబడి రైతుల వద్ద నుండి శెనగ విత్తన నమూనాలు సేకరించారు.సేకరించిన శనగ విత్తనాలను ల్యాబ్ కి పంపి రసాయనాలు ధృవీకరణ అనంతరం రైతులకు APSOPCA స్కోప్ సర్టిఫికెట్లు జారీ చేయబడతాయని మండల వ్యవసాయ అధికారి P. జ్యోష్ణ దేవి పేర్కొన్నారు. స్కోప్ సర్టిఫికెట్ పొందటం వల్ల రైతులు మంచి రేటుకు పంట ఉత్పత్తులు విక్రయించవచ్చు అని తెలిపారు. పొలంబడి రైతులకు సాంప్రదాయ యాంత్రీకరణ లో భాగంగా పంట కోత కొడవళ్ళు మండల వ్యవసాయ అధికారి అందచేసారు. పొలంబడి కార్యక్రమంలో ఎక్స్టర్నల్ ఇవాలేటోర్ k. శ్రీ హరి ప్రసాద్, గ్రామ వ్యవసాయ సహాయకులు సావిత్రి, ఇండి-గ్యాప్ పొలంబడి రైతులు పాల్గొన్నారు.
