
జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కసింకోట మండలం మోసయ్యపేట గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు పాము కాటుకు గురై తాళ్లపాలెం ప్రాథమిక వైద్య కేంద్రంలో సమయానికి వైద్యం అందక మృతి చెందినట్టు బాలుడి తల్లిదండ్రులు బంధువులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు తాళ్లపాలెం ప్రాథమిక వైద్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ను కలిసి బాలుడి మృతి సంఘటన మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపి జరిగిన దుర్ఘటనకు కారకులు అయిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనల వలన ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వచ్చే రోగులతో రోగుల బంధువులతో దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయని అన్నారు.జరిగిన సంఘటన మీద వెంటనే విచారణ జరిపి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు పెద్దదిక్కులయిన ప్రాథమిక వైద్య కేంద్రాలలో పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా ప్రమాదాల గురయ్యేది కుక్కకాటు మరియు పాముకాటు అనే ప్రమాదాలకే అని వాటికి సరైన చికిత్స అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.//