
ఉన్నతాధికారుల బందోబస్తు పరిశీలన
జనం న్యూస్,ఫిబ్రవరి 27,అచ్యుతాపురం:
రాంబిల్లి మండలంలోని బ్లూ జెట్ కంపెనీ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నిర్వహించనున్న గ్రౌండ్ బ్రేకింగ్ కార్యక్రమం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్ మరియు పరవాడ డీఎస్పీ మోహన్ రావు కార్యక్రమ స్థలాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ మార్గాలు, వేదిక భద్రత, ప్రజల రాకపోకలు వంటి అంశాలపై నిర్వాహకులతో చర్చించారు.ఈ
కార్యక్రమానికి విఐపి హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.కార్యక్రమం సాఫీగా, విజయవంతంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.