
జనం న్యూస్ ఫిబ్రవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
నేడు స్థానిక ప్రశాంతి నికేతన్ ఎం.వీ.వి ఎస్ మూర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .స్కూల్ కరెస్పాండంట్ దొడ్డి వరాహ శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్ సి.వీ. రామన్ నోబెల్ పురస్కారాన్ని పొందిన సందర్భం గా ప్రతి ఏడాది ఈ రోజు సైన్స్ దినోత్సవాన్ని మనం నిర్వహించాకుంటున్నామని , విద్యార్థులు అందరు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు . విద్యార్థులు ఉత్సహం గా పాల్గొని తమ తమ సైన్స్ ప్రాజెక్ట్ లను ప్రదర్శించారు . కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయులు డి. శ్రీనివాస్ రావు , ఎం. బాలాకుమారి అధ్యాపక ,అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు