
జనం న్యూస్ ఫిబ్రవరి 28 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలోభాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహాణ బాధ్యత లను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది 5 వ తరగతి విద్యార్థులు తోటివిద్యార్థులకు పాఠాలు బోధించారు తమ ప్రతిభను చాటుకున్నారు ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయుడిగా. బండల్ల మనోహర్ వ్యవహారించారు తోటి ఉపాధ్యాయులిగా ప్రసన్య. సుప్రియ. లహరి. తేజస్విని. వైష్ణవి. ఓంకార్. నవీన, భానుప్రియ. వరుణ్ బాధ్యతలు నిర్వహించారు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన పాఠశాల వాతావరణాన్ని ఉత్సహభరితంగా మార్చారు విద్యార్థుల నాయకత్వలక్షణాలు బాధ్యత భావం పెంపొందించేదుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మౌనిక పేర్కొన్నారు ఉపాధ్యాయులు శేఖర్ మరియు విద్యార్థుల తల్లి దండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందిచారు