
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955
వ్యవసాయంలో ఏఐ పరిజ్ఞానంతో రైతుల్ని రాజుల్ని చేయాలన్నదే ఆయన ఆలోచన శనగలకు బయట గిట్టుబాటు ధర లేనందునే ప్రభుత్వం కొనుగోళ్లకు సిద్ధమైంది.బహిరంగ మార్కెట్లో క్వింటాల్ కు రూ.5,100 ఇస్తున్నారు జీడీసీఎమ్ఎస్ఎస్సీలు, సొసైటీల ఆధ్వర్యంలో రూ.5,875 కి కొంటారు పాత మార్కెట్ యార్డ్ లో మార్క్ ఫెడ్ శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రత్తిపాటి ఆరుగాలం శ్రమించే అన్నదాతలను ఆదుకోవడంలో, వారి కష్టమొచ్చినప్పుడు తోడుగా నిలవడంలో రైతు పక్షపాతి అయిన చంద్రబాబు తర్వాతే ఏ ముఖ్యమంత్రైనా నిలుస్తారని ప్రత్తిపాటి తెలిపారు.శనివారం స్థానిక పాత మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వ నిర్వహణలో జీడీసీఎమ్ఎస్ఎస్సీ, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో పాత మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రత్తిపాటి, జీడీసీఎమ్ఎస్ ఛైర్మన్ వడ్రాణం హరిబాబునాయుడు, కూటమినాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడిన ప్రత్తిపాటి. వారి అభిప్రాయాలు, ఆలోచనలను మార్క్ ఫెడ్ అధికారులకు తెలియచేశారు. శనగల కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టాలని దిగుబడి తక్కువగా ఉన్నందున ప్రతిరైతుకు న్యాయం చేయాలని ప్రత్తిపాటి అధికారులకు సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.గతంలో పొగాకు, మిర్చికి అదనంగా బోనస్ ఇచ్చిన చంద్రబాబు కూటమిప్రభుత్వంలో మిర్చి, పొగాకు, మామిడి రైతుల్ని ఆదుకున్నారు.కష్టకాలంలో రైతులకు అండగా నిలవడంలో చంద్రబాబు తర్వాతే ఏ ముఖ్యమంత్రైనా ఉంటారని, ఇదే వాస్తవమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. గతంలో 2014-19 మధ్య కూడా పలు పంటలకు సరైన మద్ధతు ధర లేనప్పుడు చంద్రబాబు రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. పొగాకుకు క్వింటాలుకు అదనంగా రూ.2వేలు, మిర్చికి రూ.1500లు చెల్లించి రైతులకు అండగా నిలిచారన్నారు. కూటమిప్రభుత్వం వచ్చాక మిర్చి రూ.11వేలకు కొనేలా చేశారని, మామిడి, పొగాకు రైతుల్ని ఆదుకున్నారని ప్రత్తిపాటి చెప్పారు.
ఏఐ పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించి, రైతుల్ని రాజులుగా మార్చాలన్న గొప్ప ఆలోచనలోచంద్రబాబు ఉన్నారని, ఆ దిశగానే ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన బిల్ గేట్స్ తో సంప్రదింపులు జరిపారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.బహిరంగ మార్కెట్లో రూ.5 వేల నుంచి రూ.5,100 మాత్రమే చెల్లిస్తున్నందున కూటమిప్రభుత్వం శనగల కొనుగోళ్లకు సిద్ధమైందని ప్రత్తిపాటి చెప్పారు. జీడీసీఎమ్ఎస్ఎస్సీలు, సొసైటీల ద్వారా క్వింటాలుకు రూ.5,875లు శనగరైతులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శనగ రైతులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. మార్క్ ఫెడ్ అధికారులు, సిబ్బంది శనగల కొనుగోళ్లలో పారదర్శకంగా వ్యవహరించాలని, శనగల్లో తేమశాతం పెద్దగా ఉండదు కాబట్టి, రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధర దక్కేలా చూడాలని ప్రత్తిపాటి సూచించారు.కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, సొసైటీ చైర్మన్ కోడె హనుమంతరావు, మహిమర్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, రైతు నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు, అంబటి సోంబాబు, మార్క్ ఫెడ్ డీఎం నరసింహారెడ్డి, బిజినెస్ మేనేజర్ హరిగోపాల్, డిఏవో జగ్గారావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.