
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జహీరాబాద్ నియోజకవర్గంలోని జనం న్యూస్ మార్చ్ 01 03 2026
మహేంద్ర కాలనీ రెండవ నంబర్ వార్డు నుండి ఘన విజయం సాధించిన కౌన్సిలర్ సానియా ఖదీర్ తన వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తానని, గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా కాలనీలో రహదారుల మరమ్మతులు, డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు, వీధి లైట్ దీపాల ఏర్పాటు వంటి అత్యవసర పనులను ప్రాధాన్యంగా చేపడతామని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ప్రజల సమస్యలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వార్డులో శుభ్రత, భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో మహేంద్ర కాలనీని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సానియా ఖదీర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేస్తానని, వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు.