
సాయిరామ్ విద్యార్థుల ప్రతిభ..
జనం న్యూస్ మార్చి 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అమలాపురం కిమ్స్ హాస్పటల్ ఆవరణలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వహించిన సీనియర్ పద్యాల పోటీల విభాగంలో గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని గంగుల కృష్ణవేణి ప్రథమ స్థానంలో నిలిచి రూ 5 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ను అందుకున్నది. పోతుల ఏంజెల్ వక్తృత్వ పోటీలలో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రూ.1500, సీనియర్ వ్యాసరచన పోటీల్లో మొగలి శ్రీలక్ష్మి ద్వితీయ స్థానం సాధించి రూ ₹1000, వ్యాసరచన జూనియర్స్ విభాగంలో మెండా శ్రీవిద్య ద్వితీయ స్థానం సాధించి రూ. ₹1000 క్యాష్ ప్రైజ్ లుఅందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం ,నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్ర వర్మ, గుత్తాల విజయదుర్గ అభినందించారు.
