జనం న్యూస్ ఫిబ్రవరి 11 ముద్దనూరు:
ముద్దనూరు బాలుర ఉన్నత పాఠశాలలో 1987 -1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముద్దనూరు మండల రెవెన్యూ ఆఫీసర్ వరద కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో ద్రోణాచార్య విగ్రహాన్ని 1987 -1992 పూర్వ విద్యార్థి ఎంవీ రమణారెడ్డి ని అభినందించడం జరిగింది. ద్రోణాచార్యుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల మండల ఎంపీడీవో ముకుంద రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరూ కలుసుకొని కష్టసుఖాలను తెలుసుకోవడం ఎంతో ఆనందం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాజబాబు మాట్లాడుతూ పాఠశాలకు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పూర్వ విద్యార్థులను అభినందించడం జరిగింది. పాఠశాలలో పూర్వ విద్యార్థులకు విద్యను అభ్యసించినటువంటి రాజబాబు,వెంకటేశ్వరరెడ్డి ప్రసాద్ చంద్రకళ, లక్ష్మీనారాయణ రెడ్డి,అబ్దుల్, శివ ప్రభాకర్ రెడ్డి, మాబు, మనోహర్ రెడ్డి ,భారతి, రమాదేవి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.