
జనం న్యూస్ మార్చి 03: నిజామాబాద్ ఏర్గట్ల
మండల కేంద్రంనకు చెందినఏనుగంటి రాజు గౌడ్ కుమారుడు మనీష్ గౌడ్ (9వ తరగతి విద్యార్థి) తెలంగాణ వాలీబాల్ జట్టు తరఫున కోల్‌కతాలో జరిగిన నేషనల్ వాలీబాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలోమంగళవారం రోజునా మనీష్ గౌడ్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తుపాకుల శ్రీనివాస్ గౌడ్, కరుణాకర్ గౌడ్, గోవింద్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మగ్గిడి వెంకటేష్ గౌడ్, నాగరాజ్ గౌడ్, హరీష్ గౌడ్, సంపత్ గౌడ్, సాంబ గౌడ్‌తో పాటు గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి చేరిన మనీష్ గౌడ్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.