
జనం న్యూస్ మార్చి 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఫతేనగర్ శివాలయంలో అట్టుకల్ పొంగాలా మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. కేరళకు చెందిన ఈ పవిత్ర ఉత్సవం అట్టుకల్ పొంగాలాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మహిళల అత్యధిక సమూహంగా నిర్వహించబడే ఈ వేడుకకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించడం విశేషం.
ఈ సందర్భంగా స్థానిక మహిళా భక్తులు సంప్రదాయరీతిలో పొంగాల వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకుడు కంచి మహేందర్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఉత్సవంలో పాల్గొని సాంప్రదాయ సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు.
అలాగే ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రన్, కార్యదర్శి జైన్, రేజీ తదితర కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
