
జనం న్యూస్ మార్చి 3 ముమ్మిడివరం ప్రతినిధి
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో వికసిత భారత్ “ – యువ కనెక్ట్ ప్రోగ్రామ్(వి బి వైసిపి) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం వికసిత భారత్@ 2047 జాతీయ దృష్టికి అనుగుణంగా, యువతలో దేశ నిర్మాణం, నాయకత్వం, నవోత్తానం మరియు సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది.ఈ విశిష్టతను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు ప్రొ. కుమార్ మొలుగారం వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.అలాగే గనిశెట్టి అరవింద్ కుమార్ అతిథి & స్పీకర్ గా పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ , అరవింద్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, ఉస్మానియా విశ్వవిద్యాలయ జ్ఞాపికను అందజేశారు .అరవింద్ వారి ప్రసంగంలో యువత దేశ అభివృద్ధిలో పోషించాల్సిన కీలక పాత్ర, బాధ్యతాయుత నాయకత్వం, ఆవిష్కరణాత్మక ఆలోచనలు మరియు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువత భాగస్వామ్యం ఎంత ముఖ్యమో స్పష్టంగా వివరించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వారు ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ (ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ) కాగా,కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. రాజేంద్ర నాయక్ (డీన్, స్టూడెంట్స్ అఫైర్స్) వ్యవహరించారు.ఈ కార్యక్రమం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఏ) ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్ లోని అసెంబ్లీ హాల్ 02 మార్చి 2026 (సోమవారం), ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడింది.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి, నాయకత్వ గుణాలు మరియు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంపై స్పష్టమైన దృష్టిని పెంపొందించిన ఒక స్మరణీయమైన సందర్భంగా జరిగింది.
