
జనం న్యూస్ మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువలకు నీళ్లు అందక యాసంగి కి పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మండలంలో సాగు నీటి అవసరం ఎక్కువగా ఉన్న తరుణంలో భూగర్భ జల మట్టం వేగంగా అడుగంటగా చివరి ఆయకట్టుకు కాలువ నీరు అందకపోవడంతో చివరి దశకు వస్తున్న పైరు ఎండిపోతున్నాయి. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉండగా పంటలు పూర్తిగా ఏప్రిల్ , మే మాసం వరకు పరిస్థితి విషమించి పెద్ద ఎత్తున వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు .
రైతుల పంటలు చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోకపోతే రైతుల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యే అవకాశం ఉన్నది. ఎస్సారెస్పీ నీరు అందక రైతులు నిరాశ చెందుతున్నారు. ఎస్సారెస్పీ నుండి చిన్న ఉప కాలువ వరకు నీరు అందించాలని అధికారులు నిర్ణయించిన ,ఏప్రిల్ వరకు నీటి తడులకు పోడిగింపు చివరి ఆయకట్టు వరకు నీరు పారేలా చూడాలని కాలువలకు అధిక మొత్తం లో నీటిఅవసరం ఉన్న పంట భూములకు,గొలుసు కట్టు చెరువులు ,కుంటల్లోకి నీటిని జలాల స్థిరంగా కొనసాగిస్తేనే పంటలను కాపాడుకోవచ్చు.జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఉన్న పైపులను తొలగించాలి జాతీయ రహదారి ఓగులాపూర్ నూతన బ్రిడ్జి కింద ఉన్న పైపులను తొలగిస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తేనే పంటలు సమృద్ధిగా పండుతాయి. శాయంపేట, మైలారం, ఆరేపల్లి ,పత్తిపాక రైతుల పంటలు చివరి దశలో ఉన్నాయి. కాబట్టి నీళ్లు అందకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి ప్రవాహానికి చెత్తాచెదారం తట్టుకుని నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న రైతన్నలు సొంతంగా చెత్త తీసి వేశారు అయినా కూడా నీళ్లు చివరి ఆయకట్టు వరకు అందకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు స్పందించి వెంటనే ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు…