
జనం న్యూస్ మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అయినవిల్లి మండలం,కే.జగన్నాధపురం గ్రామం, గొంతు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పెరుమాళ్ళ రాజారావు కష్టాలు నల్లా శ్రీను ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,, రాష్ట్ర మహిళా జనసేన నాయకురాలు ముత్యాల మన్నెమ్మ వారి సహకారంతో 2000 రూపాయల విలువైన నిత్యవసర వస్తువులు ఈరోజు వివేకానంద సేవాసమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టర్) చేతుల మీదగా ఇవ్వటం జరిగింది. దీనికిగాను కుటుంబ సభ్యులు, మన్నెమ్మ వారి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లా గణేష్,యనమదల వెంకటరమణ,సరేళ్ళ గౌరీశంకర్,సూధా సత్యనారాయణ, సిహెచ్.ఏసుబాబు మరియు మన్నే సురేష్ లు పాల్గొన్నారు.