జనం న్యూస్ ఫిబ్రవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ లో స్థానికుల ఫిర్యాదు మేరకు భువన విజయం గ్రౌండ్స్ పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిహెచ్ఎంసి ద్వారా షటిల్ కోర్టు టెన్నిస్ కోర్టు అభివృద్ధి పనులు చేయించారు. కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారు క్రీడాకారులు దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మంచినీరు బాత్ రూమ్స్, వాచ్ మెన్, ఎలక్ట్రికల్ తగిన సదుపాయాలు కల్పించకపోగా అక్కడికి వచ్చిన క్రీడాకారులు మీద భారం పడకుండా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారు బాధ్యత వహించాలని, అలాగే వాకింగ్ ట్రాక్ పనులు పూర్తిచేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని పార్కు మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని, చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు ఓపెన్ జిమ్ సామాగ్రి మొత్తం పాడైపోయిన కారణంగా వాటి స్థానంలో కొత్త ఏర్పాటు, చేయాలని పార్క్ కి వాచ్ మెన్ పెట్టి పార్కు మెయింటినెన్స్ అసోసియేషన్ చూసుకోవాలని త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి స్థానికులకు అందజేయాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారుఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాలు బాబురావు, డి శంకర్ స్పోర్ట్స్ వీరానందం పవన్, రాజేష్ లక్ష్మీరాజు సాయి పాతూరి గోపి రంగమోహన్ భువన్ విజయం గ్రౌండ్ అసోసియేషన్ వారు తదితరులు పాల్గొన్నారు