
జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రము లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో ప్రిన్సిపల్ జీ రజని అధ్యక్షతన లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రవీందర్ సంధ్యారాణి పాల్గొన్ని పాఠశాలలోని 500 మంది విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు. ఇందులోభాగంగా ప్రముఖ వైద్య నిపుణులు పిల్లల డాక్టర్ డాక్టర్ తిరుపతి, దంతవైద్యులు డాక్టర్ భాను చందర్, గైనకాలజిస్ట్ డాక్టర్ హరిక, ఫిజీషియన్ డాక్టర్ యం డి మునిబ్ పాఠశాలకు, వచ్చి విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవైద్య సేవలు అందించి విద్యార్థినులకు మందుల పంపిణి చేసారు. పీ హెచ్ సి డాక్టర్ ఎన్ సాయి కృష్ణ సీ ఆర్ పీ చేయడం ఎలా అనే విషయాన్ని విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీ హెచ్ సి డాక్టర్లు ఎన్.సాయి కృష్ణ, బి. శ్రావణి ఎ ఎన్ యం పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్ , పాఠశాల హెల్త్ సూపర్వైజర్ స్వప్న ఉపాద్యాయునిలు ఆశా వర్కర్లు తదితరులు ఎాల్గొన్నారు….