
జనంన్యూస్. 07.సిరికొండ.శ్రీనివాస్ పటేల్
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారీ సిరికొండ గ్రామంలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఐనాల ఒడ్డెన్న ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అలాగే రావుట్ల గ్రామం లో రమేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.తదనంతరం సిరికొండ మండలం SCమోర్చా అధ్యక్షులుగా సిరికొండ గ్రామానికి చెందిన బందెల ధర్మపురిని నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు సూచించారు. తమకు అప్పగించిన బాధ్యతను గుర్తించి నిబద్ధతతో పని చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిరికొండ మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
బందెల ధర్మపురి కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

