
బిచ్కుంద మార్చి 7 జనం న్యూస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్టి సంధార్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలకు గౌరవం మరియు సమాన అవకాశాలు లభించే సమాజంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నేటి తరం మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు మరియు రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని చైర్మన్ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మరింత మంది మహిళలు ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు సంకల్పంతో ముందుకు రావాలని చైర్మన్ ఆకాంక్షించారు.