
జనం న్యూస్ మార్చి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయం (ఐ.డి.ఓ.సి)లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన లో నిర్ణయించారు ఈ సమావేశంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులకు వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలోని శాయంపేట మండలంలోని ప్రభుత్వ గురుకుల ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్కొరత లేకుండా చూడాలని,కోతుల బెడద లేకుండా చూడాలని,కిచెన్ షేడ్స్ నిర్మాణం చేయాలని, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడాలని, అదేవిధంగా మండలంలోని గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సమస్య లేకుండా చూడాలని,అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.అదేవిధంగా పలు అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో దిశ వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ మేయర్ గుండు సుధారాణి చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి ,జిల్లా కలెక్టర్ చాహత్ బాజిపై , జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు….